సేవా మూర్తి.. బుయ్యని సరళారెడ్డి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సేవా మూర్తి.. బుయ్యని సరళారెడ్డి..!
– ఆర్బీఓఎల్ ఎండికి శుభాకాంక్షల వెల్లువ
– నివాసంలో అట్టహాసంగా జన్మదిన వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళారెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.

శనివారం తాండూరులోని వారి నివాసంలో బుయ్యని సరళా రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతులను నాయకులు, ఆప్తులు కలిసి ఘనంగా సన్మానించారు. శాలువా, పూలమాల వేసి సరళారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్‌ కట్ చేయించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ భర్త శ్రీనివాస్ రెడ్డి అడుగు జాడల్లో సరళారెడ్డి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు.

విద్యరంగంలో పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరోన్నె జరుపుకోవాలని, సామాజిక సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్, పెరుమాళ్ల ఎడ్యూకేషనల్ సోసైటి చైర్మన్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, కాంగ్రెస్ యువనాయకులు బాతుల నాగు, వికాష్ జోషి తదితరులు పాల్గొన్నారు.

దేవుడా.. ఇదేం గుండె కోతయ్యా..!