రేపు తాండూరులో పవర్ కట్..!

Uncategorized తాండూరు రాజకీయం వికారాబాద్


రేపు తాండూరులో పవర్ కట్..!
– విద్యుత్ ఉండని ప్రాంతాలు ఇవే
– కారణాలు ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు పట్టణంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు.
kvcs
పట్టణంలోని ముర్షద్ దర్గా సమీపంలోని చెన్ గెష్ పూర్ రోడ్డు విస్తరణ పనులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో ఉన్న విద్యుత్ స్థంబాలను తొలిగింపు చేయడం జరుగుతుందన్నారు. ఈ కారణంగా ముర్షద్ దర్గా ప్రాంతం, గాంధీనరగ్ పార్ట్, విశ్వంబర కాలనీ, బృందావని కాలనీ, చెన్ గెష్ పూర్ రోడ్డు మార్గం, గొల్ల చెరువు పార్టులో విద్యుత్ సరఫరా ఉండదని వివరించారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అభివృద్ధి పనుల నేపథ్యంలో కలిగిస్తున్న అంతరాయానికి సహకరించాలని మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల కూడా విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

చైతన్యలో ఫుల్ జోష్..!