అభివృద్ధికి ఎంపీ నిధుల తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ధికి ఎంపీ నిధుల తోడ్పాటు
– బీజేపీ మహిళ మోర్చ ప్రధాన కార్యదర్శి సాహు శ్రీలత
– 24వ వార్డులో సీసీ నిర్మాణ పనులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధిలో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోటా నిధులు తోడ్పాటు అందిస్తున్నాయని మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు.

శనివారం తాండూరు పట్టణం వార్డు నెంబర్ 24లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోటా నిధులు రూ. 5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సాహు శ్రీలత లక్ష్మీకాంత్ బీజేపీ రాష్ట్ర నాయకులు యు.రమేష్‌ కుమార్, బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్ అంతారం కిరణ్‌, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్‌ గౌడ్‌లతో కలిసి రోడ్డు పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పటివరకు తాండూరు మున్సిపాలిటీకి రూ. 80 లక్షల నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. నియోజకవర్గానికి రూ. 2కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారుఉ. తాండూరు అభివృద్ధిలో ఎంపీ నిధులు తోడ్పాటును అందిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా, అమృత్ స్కీమ్, సీఆర్‌ఐఎఫ్, ఉపాధి హామి తదితర నిధులు అభివృద్ధిలో భాగమవుతున్నాయని అన్నారు. వార్డు అభివృద్ధి కోసం నిధులు కోరిన వెంటనే మంజూరు చేయడం పట్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

పట్నం రుక్కమ్మకు శ్రద్దాంజలి