డేంగీ కలకలం..!
– తాండూరులో రెండు కేసులు
– బయటకు రానివ్వని వైనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో డేంగీ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలో తాండూరులో రెండు డేంగీ కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు మాణిక్ నగర్ ప్రాంతానికి చెందిన కార్తిక్ అనే బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చేర్పించగా డెంగీ నిర్దారణ అయ్యింది.
అదేవిధంగా పట్టణంలోని విలియమూన్ హైస్కూల్లో నివాసం ఉంటున్న కలకత్తాకు చెందిన రాబిన్ ఖర్మారార్‌కు కూడా డేంగీ నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు. మరోవైపు వారం రోజుల కిందటే తాండూరులో డేంగీ కేసు నమోదైనట్లు సమాచారం. కాని అధికారులు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు పుకారు. తాండూరులో డేంగీ కలకలం రేపడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతున్నారు.
ఇదికూడా చదవండి…

