ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి..!
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
– ఘనంగా వర్ధంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.

గురువారం వీరవనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా తాండూరులో ఆమెకు ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని ఐలమ్మ విగ్రహం వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజ బాల్‌రెడ్డి, రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, తెగువ నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం పట్టణ అధ్యక్షుడు రాజు, కార్యదర్శి శాంతు, జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణ, ఉపాధ్యాయ కమిటీ నేతలు మోహన్‌, సుధాకర్‌, నాగప్ప, తాండూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఐనెల్లి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి తిమ్మాయిపల్లి శ్రీనివాస్‌, కోశాధికారి రాములు, ఆర్గనైజర్‌ చంద్రయ్య, నరేందర్‌, సంఘం నాయకులు అశోక్‌, రవి, పెంటప్ప, బాలు, బస్వరాజ్‌, సీనియర్‌ నాయకులు సాయిలు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

రోడ్లపై గుంతలకు చెక్..!