మొబైల్‌లో ఇలా చేస్తే చాలు!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మొబైల్‌లో ఇలా చేస్తే చాలు!
– ఇంటి నుంచే కొత్త పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
– స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి
దర్శిని డెస్క్: కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారా..? మీ అప్లికేషన్ ఏమైంది..? మంజూరైందా.. లేదా ఇంకా పరిశీలనలో ఉందా..? తెలుసుకునేందుకు ఇక మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఇంటి నుంచే అప్లికేషన్ వివరాలను పరిశీలించుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం అందించే కొత్త పెన్షన్లకు సంబంధించి మంజూరైన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు ఉంది.

ఇలా చెక్ చేసుకోండి..
ముందుగా మొబైల్‌లో ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి cheyutha.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ హోమ్‌పేజీలో కనిపించే Quick Search విభాగాన్ని ఎంచుకోవాలి.

అందులో ఉన్న New Sanctions Applicants Search ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ వద్ద ఉన్న Application ID లేదా Aadhaar IDలో ఏదో ఒకదాన్ని నమోదు చేసి సెర్చ్ చేయాలి. సంబంధిత అప్లికేషన్ వివరాలు అందుబాటులో ఉంటే స్క్రీన్‌పై కనిపిస్తాయి.

అప్లికేషన్ ఐడీ గుర్తు లేకపోయినా ఆందోళన అవసరం లేదు. సంబంధిత District, Mandal/Municipality, GP/Ward వివరాలను ఎంపిక చేసుకుని కూడా కొత్తగా మంజూరైన పెన్షన్ లబ్ధిదారుల జాబితాను పరిశీలించవచ్చు.

మీ గ్రామం లేదా వార్డుకు సంబంధించిన జాబితా తెరుచుకున్న తర్వాత అందులో మీ పేరు, ఇతర వివరాలను వెతికి చూడాలి. పేరు ఉంటే కొత్త పెన్షన్ మంజూరైనట్లు తెలుసుకోవచ్చు.

అంటే.. పెన్షన్ దరఖాస్తు పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్‌లో కొన్ని క్లిక్‌లతో వివరాలు పరిశీలించుకోవచ్చు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

 

జెట్టెపాగ నరేష్‌ మృతి బాధాకరం