భవాని మాత సేవలో వర్త్య విఠల్‌ నాయక్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

భవాని మాత సేవలో వర్త్య విఠల్‌ నాయక్‌
– కుటుంబ సమేతంగా తుల్జాపూర్‌ అమ్మవారి దర్శనం
– తాండూరు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాండూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వర్త్య విఠల్‌ నాయక్‌ కుటుంబ సమేతంగా మహారాష్ట్రలోని తుల్జాపూర్‌లో కొలువైన శ్రీ తుల్జా భవాని మాతను దర్శించుకున్నారు.

బుధవారం తన సతీమణి వర్త్య కిష్టమ్మ(ఎల్‌ఎఫ్‌ఎం కోకట్‌ హెడ్‌మాస్టర్‌), కుటుంబ సభ్యులు రాజు నాయక్‌, రుకీబాయ్‌, విఘ్నేష్‌ నాయక్‌ తదితరులతో కలిసి అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ విఠల్‌ నాయక్‌ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్న విఠల్‌ నాయక్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం విఠల్‌ నాయక్‌ మాట్లాడుతూ తుల్జా భవాని అమ్మవారి ఆశీస్సులతో తాండూరు ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

Pvr

జిల్లా కలెక్టర్ వద్దకు స్మశాన వాటిక పంచాయతీ