ధాన్యం రైతుల‌కు సీఎం కేసీఆర్ భ‌రోసా

తాండూరు రాజకీయం వికారాబాద్

ధాన్యం రైతుల‌కు సీఎం కేసీఆర్ భ‌రోసా
– చివ‌రి గింజ వ‌ర‌కు కొనాల‌నే నిర్ణ‌యం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తిమ్మాయిప‌ల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
యాలాల, ద‌ర్శిని ప్ర‌తినిధి: కేంద్రం ధాన్యం రైతుల‌ను ద‌గా చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ వారిని భ‌రోసాగా నిలిచార‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమ పథకాలకు తెలంగాణ స‌ర్కారు పెద్దపీట వేసింద‌న్నారు. రైతు బీమా, రైతుబంధు, పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌ల‌ను క‌ల్పిస్తుంద‌న్నారు. కేంద్రం ధాన్యం రైతుల‌ను ద‌గా చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు ధాన్యం చివ‌రి గింజ వ‌ర‌కు కొనుగోలు చేసి భ‌రోసాగా నిల‌వాల‌ని నిర్ణ‌యించార‌ని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను రైతులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠ‌ల్ నాయక్, మండల పార్టీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సప్తగిరి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ రాములు, జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, జుంటుపల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి నాయకులు అన్నాసాగర్ రవీందర్, శ్రీనివాస్ గౌడ్, అరవింద్ కుమార్ రెడ్డి, కృష్ణ, మలిగిరి నర్సింలు, సాయిలు, గోపాల్, అశోక్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.