బల్దియాలో బతుకమ్మ జోష్..!
– అట్టహాసంగా సంబరాలు
– బతుకమ్మకు చైర్ పర్సన్ పూజలు
– వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్లు, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం మున్సిపల్ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.

మున్సిపల్ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సంబరాలు పూల అందాలు, బతుకమ్మ పాటలు, మహిళల ఆటపాటలతో సందడిగా సాగాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి బతుకమ్మను ఎత్తుకుని వచ్చారు. ముందుగా భక్తిశ్రద్దలతో బతుకమ్మకు పూజలు నిర్వహించారు.

అనంతరం చైర్ పర్సన్తో పాటు వేడుకలకు హాజరైన కౌన్సిలర్లు, మహిళ సంఘాల అర్పీలు, అధికారులు సిబ్బంది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ చిందులు వేశారు. బతుకమ్మ పాటలతో మున్సిపల్ కార్యాలయం మార్మోగింది.

ఈ సందర్భంగా చైర్ పర్సన్తో పాటు పలువురు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తోందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రామకృష్ణ, బాలకృష్ణారెడ్డి, యోగానంద్, దివిటి ఎల్లప్ప, సురేష్ నాయక్, నాగలక్ష్మీ, రూప రుద్రుపాటిల్, నవీనా సంతోష్ గౌడ్, సుప్రీత కరుణాకర్, నార శ్రీలత, కోఆప్షన్ సభ్యులు సరితా హరిగౌడ్, సుభాష్, ఆర్వో అశోక్, పలు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


