ఏటీసీలో దసరా సెలబ్రేషన్స్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఏటీసీలో దసరా సెలబ్రేషన్స్..!
– ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు
– పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఉన్న అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) కళాశాలలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.

శుక్రవారం నిర్వహించిన ముందస్తు సంబరాలు విద్యార్థుల ఆటపాటలు, బతుకమ్మ వేడుకలతో సందడిగా సాగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా కళాశాలలోని యంత్రాలు, పరికరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి కళాశాల ప్రిన్సిపల్‌ విజయకుమారి, అధ్యాపకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు ఆటపాటలతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, సాంకేతిక రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

విద్యార్థులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకుని, తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దసరా, బతుకమ్మ పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నార శ్రీలత, కోఆప్షన్ సభ్యురాలు సరితా హరిగౌడ్, కళాశాల ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, అధ్యాపకులు సాయిప్రసాద్, పధ్మనాభ చారి, శ్రీశైలం, శివకుమార్, సుభాష్‌, కదీర్, సాయి సంప్రీత్, శ్రీనివాస్, పద్మ విద్యార్థులు పాల్గొన్నారు.

Pvr

కాళికాదేవి సన్నిధిలో చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి