రండి సద్దుల బతుకమ్మ ఆడుదాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రండి సద్దుల బతుకమ్మ ఆడుదాం..!
– వేడుకలకు సిద్ధమైన సాయిపూర్
– పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
– ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఆర్తిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలకు తాండూరు పట్టణంలోని సాయిపూర్‌ సిద్ధమవుతోంది.

9వ వార్డులోని తాత గుడి ఆవరణలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఆర్తిరెడ్డి, ప్రమోదిని విఠల్‌రెడ్డి హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో వేడుకలను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు.

మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి
తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని పట్లోళ్ల దీపా నర్సింలు కోరారు.

బతుకమ్మ ఆటపాటలతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చాటాలని పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యంతో వేడుకలను విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Pvr

బల్దియాలో బతుకమ్మ జోష్‌..!