బంటు వారింట్లో గృహమస్తు..!
– అంగరంగ వైభవంగా నూతన గృహప్రవేశం
– బంటు మల్లప్పకు శుభాకాంక్షల వెల్లువ
– తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప ముదిరాజ్‌కు గృహమస్తు ఆశీర్వాదాలు లభించాయి.

సాయిపూర్ లోని న్యూనలంద పాఠశాల పక్కన మల్లప్ప నిర్మించిన నూతన గృహ ప్రవేశ వేడుకలు బుధవారం అంగరంగ వైభోగంగా జరిగాయి. మూడు రోజులుగా బంటు మల్లప్ప కొత్త ఇంట్లో గృహ ప్రవేశ వేడుకలు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన నూతన గృహప్రవేశ వేడుకలకు రాజకీయ అథిరథ మహారథులు తరలివచ్చారు.

తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వేడుకలకు హాజరై బంటు మల్లప్ప, లక్ష్మీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి కూడా హాజరై శుభకాంక్షలు చెప్పారు. ఇంకా ముదిరాజ్ సంఘం నాయకులు కాసాని జ్క్షానేశ్వర్ కుమారుడు కాసాని వీరేశం పాల్గొని అభినందనలు తెలిపారు. వారితో పాటు మాజీ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు, హైదరాబాద్ గ్రేటర్ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ యాదవ్, సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్‌లు శుభాసీస్సులు అందించారు.

అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ లు విజయలక్ష్మి వెంకటయ్య, స్వప్న పరిమళ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రత్నమాల నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, బీజేపీ నేతలు యు. రమేష్ కుమార్, నాగారం మల్లేశం, అంతారం లలిత, భద్రేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ రావుఫ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మదనసింహారెడ్డి, యువ నాయకులు బంటు వేణుగోపాల్, బాతుల నాగు, వికాస్ జోషి, మాజీ కౌన్సిలర్లు, పలు పార్టీల చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై నూతన గృహప్రవేశంలో పాల్గొన్నారు. బంటు మల్లప్ప దంపతులకు శుభాంక్షలు తెలిపారు.

అనంతరం విందులో పాల్గొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారులు, బంధుమిత్రులు, అభిమానులతో బంటు మల్లప్ప కొత్త ఇంట్లో సందడి నెలకొంది.

ఇదికూడా చదవండి…

