కరణ్‌ కోట్ ఎస్‌ఐగా అన్వేష్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

కరణ్‌ కోట్ ఎస్‌ఐగా అన్వేష్ రెడ్డి
– పాత ఎస్ఐ ధారూర్‌కు బదిలీ
– బాధ్యతలు చేపట్టిన కొత్త ఎస్ఐ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రూరల్ సర్కిల్‌ పరిధిలోని కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌ ఎస్ఐగా అన్వేష్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

ఇక్కడ పనిచేసిన ఎస్ఐ రాథోడ్‌ వినోద్‌ ధారూర్‌ పోలీస్టేషన్‌కు బదీలీ అయ్యారు. 15 నెలల పాటు ఎస్ఐ రాథోడ్ వినోద్ విధులు నిర్వహించారు. తాజాగా ఉన్నతాధికారులు రాథోడ్‌ వినోద్‌ను బదిలీ చేశారు.

దీంతో ఆయన స్థానంలో కరణ్‌ కోట్ కొత్త ఎస్‌ఐగా డీఐజీ కార్యాలయంలో వేయిటింగ్‌లో ఉన్న అన్వేష్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆదివారం ఎస్‌ఐగా అన్వేష్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అసాంఘీక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారించి అరికడుతామని అన్నారు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. బాధితులు చేసిన ఫిర్యాదులపై బాధ్యతాయుతంగా స్పందిస్తామని అన్నారు.

Pvr

స్మశాన వాటిక సంరక్షణపై సమరశంఖం