తుల్జాపూర్ భవాని మాత సన్నిధిలో చైర్ పర్సన్

తాండూరు రాజకీయం వికారాబాద్

తుల్జాపూర్ భవాని మాత సన్నిధిలో చైర్ పర్సన్
– కుటుంబంతో కలిసి అమ్మవారి దర్శనం
– తాండూరు ప్రజల సుఖ సంతోషాల కోసం పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులు మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ భవాని మాతను దర్శించుకున్నారు.

బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తుల్జాపూర్‌ భవాని మాత ఆశీస్సులు తాండూరు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.దసరా పర్వదినం సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలందరికీ అమ్మవారి కృపాకటాక్షాలు లభించాలని ఆకాంక్షించారు. తాండూరు పట్టణ ప్రజల జీవితాల్లో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు.

దసరా.. రగడ..!