తాండూరు మున్సిపల్‌కు మహర్థశ
– కార్పోరేషన్‌గా పురోగతికి అవకాశం
– అర్హతలపై కసరత్తు చేస్తున్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో తాండూరు మున్సిపల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోనే మొట్ట మొదటగా ఏర్పడిన మున్సిపాల్టీ కార్పోరేషన్‌గా పురోగతి చెందే అవకాశాన్ని అందుకోబోతోంది. ప్రస్తుతం గ్రేడ్-2 మున్సిపాలిటీగా కొనసాగుతోంది. పట్టణంలో 71వేల జనాభా, 36 వార్డులు ఉన్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్, 200పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, 100పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రెసిడెన్షియల్ కాలేజీలు, స్కూల్స్, డిఎస్పీ కార్యాలయం, ఫారెస్ట్ రేంజ్, సబ్-రిజిస్ట్రార్, మైన్స్ ఏడీ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ వంటి పలు డివిజనల్ కార్యాలయాలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తాండూరు మున్సిపాలిటీకి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. తాండూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు అడుగులు పడుతున్నాయి.
ఇందుకు అధికార యంత్రాంగం కసరత్తును చేస్తోంది. ప్రస్తుతం 36మంది కౌన్సిలర్లు ఉండగా, ఈసంఖ్య 50 దాటే ఛాన్స్ ఉంటుంది. పట్టణ పరిధి కూడా విస్తరిస్తోంది. పట్టణ జనాభాతోపాటు శివారులో ఉన్న గ్రామాలను కలిపి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్‌కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ, రసూల్‌పూర్ ఆంజనేయస్వామి ఆలయం, కోకట్ రోడ్డు సాయిబాబా మందిర ప్రాంతాలు విలీనమయ్యాయి. తాజాగా గౌతాపూర్, అంతారం, అంతారంతండా, ఖాంజాపూర్, కోకట్, అల్లాపూర్(ఎస్), చెనిగే్‌షపూర్, కోణాపూర్, గోపన్‌పల్లి, బషీర్‌మియాతండా, కందనెల్లి గ్రామాలు విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో లక్ష జనాభా, ఆదాయం, వసతులను, అర్హతలతో తాండూరు మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి అప్‌గ్రేడ్ కాబోతోంది.
పెరిగే విస్తీర్ణం ఇలా..



