
ఎమర్జెన్సీ ఓ చీకటి యుగం..!
– ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్
– రాబోయో రోజుల్లో బుద్ది చెప్పాలి
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఎమర్జెన్సీ దేశానికి ఓ చీకటి రోజు అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జీలు ధరించి ఎమర్జెన్సీ నిర్ణయానికి, కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగమని అన్నారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ రాజకీయ స్వార్థాల కోసం ఎమర్జెన్సీని అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రపంచలో కని వినీ ఎరుగని నిర్ణయాన్ని తీసుకుందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అధికార దురహంకారంతో నియంతృత్వ దోరణిని మరిచిపోలేని రోజుగా మిగిలిందన్నారు. ఇప్పటికా కాంగ్రెస్ పార్టీ అదే విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. వ్యక్తులను, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ చిచ్చుపెట్టే రాజకీయాలు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బొందపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దోమ కృష్ణ, అంతారం కిరణ్, జగదీష్, తాండ్ర నరేష్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

