స్మశాన వాటికను విడిపించండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

స్మశాన వాటికను విడిపించండి..!
– స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌కు దళిత ఎస్సీ వెల్పేర్ సోసైటి వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి సర్వేనెంబర్ 3లో ఉన్న స్మశాన వాటికను కబ్జా నుంచి విడిపించాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను దళిత ఎస్సీ వెల్పేర్ సోసైటీ సభ్యులు కోరారు.

బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌ను సోసైటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వేనెంబర్ 3లో శిఖం భూమిలో ఉన్న స్మశాన వాటికను స్థానిక రియల్ ఏస్టేట్ వ్యాపారి కబ్జాకు పాల్పడుతున్నట్లు స్పీకర్‌ దృష్టికి తీసుకవచ్చారు.

స్మశాన వాటికలో ఉన్న సమాధులను కూల్చి ఆక్రమణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తాండూరు ఆర్డీఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తుచేశారు. స్మశాన వాటికను కబ్జా నుంచి విడిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞఫ్తి చేశారు.

పోలీస్‌ కొలువే లక్ష్యంగా చదవండి