పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..!
– కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం
– అప్పటి వరకు దరఖాస్తుకు అవకాశం
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలనుకునే వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు పట్టభద్రులు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు నుంచి డిసెంబర్‌ 10 వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు.

గడువు పొడిగింపుతో ఇప్పటివరకు నమోదు చేసుకోలేకపోయిన పట్టభద్రులకు మరో అవకాశం లభించింది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రైతుల పట్ల చిన్నచూపు తగదు..!