8న అండ‌ర్-16 క్రికెట్ క్రీడాకారుల ఎంపిక

క్రీడలు తాండూరు వికారాబాద్

8న అండ‌ర్ -16 క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
– టీసీఏ ఆధ్వ‌ర్యంలో సెల‌క్ష‌న్స్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16 క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8న తాండూర్ పట్టణంలోని సెయింట్ మార్క్స్ పాఠశాల మైదానంలో ఉదయ 9 గంటలకు క్రీడాకారుల ఎంపిక చేప‌డ‌తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఎంపికలు క్రికెట్ కోచ్‌లు సతీష్, జగన్నాథ్ రెడ్డి, హరిష్‌ల ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతాయ‌ని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు సొంత క్రికెట్ కిట్, యూనిఫాం, పుట్టినతేది సర్టిఫికేట్, ఆధార్ కార్డులో హజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు సెల్‌: 917784 7227, 8639730046ల‌కు సంప్రదించాలని సూచించారు.