తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కారుల పాత్ర కీలకం

తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కారుల పాత్ర కీలకం
– తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఎన్. శుభప్రద్ పటేల్
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర అత్యంత కీలకమైందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఎన్.శుభప్రద్ పటేల్ అన్నారు. శనివారం పెద్దేముల్ మండలానికి చెందిన పలువురు ఉద్యమకారులను వారి నివాసాలకి వెళ్ళి కలుసుకుని ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామ గ్రామాన, పల్లె పల్లెనా ఎంతో మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యమకారుల పాత్ర వెలకట్టలేనిదని, సీఎం కేసీఆర్ దశలవారీగా ఉద్యమకారులను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన ఉద్యమకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఉద్యమకారులు ఎన్.శుభప్రద్ పటేల్ ను శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెద్దేముల్ మండల తెలంగాణ ఉద్యమ కారులు గౌస్, ఎర్ర రవీందర్,అన్వర్, గయాజ్, బండపల్లి కేశవ్, జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ చారి, బాను, జిలాని, వాజిద్, డబ్బుల నర్సిములు,సయీద్, అంజి,మండల టీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు సంగమేశ్వర్,రమేష్, రఘు, తదితరులు పాల్గొన్నారు..