మాదిగలను మోసం చేస్తున్న కేంద్రం
– పార్లమెంట్ సమావేశాల్లో SC వర్గీకరణ బిల్లు పెట్టాలి
-ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ మాదిగ
తాండూరు, దర్శిని ప్రతినిధి: అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ మాదిగ అన్నారు. సోమవారం ఎమ్మెస్పీ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్‌ల ఆధ్వర్యంలో పట్టణంలోని అషు డ్యాన్స్ స్టూడియోలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పెద్దోళ్ల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ మాదిగ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో Sc వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో పెడుతామణి చెప్పి నేటికీ బిల్లు పెట్టకుండా మాదిగలను నమ్మించి మోసం చేసింది కావున బిజెపితో తాడోపేడో తేల్చుకుని గద్దె దింపడానికి మాదిగ మాదిగ ఉపకులాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కొత్తతరం యువకులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి వచ్చే నెల జూన్ 6 నుండి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో మహాసంగ్రామ పాదయాత్ర ను దౌల్తాబాద్ మండలం నుండి ప్రారంభించడం జరుగుతుంది ఈ పాదయాత్ర వికారాబాద్ జిల్లాలో అన్ని గ్రామాలు అన్ని మండలాలు తిరుగుతూ మాదిగ విద్యార్థులను యువకులను చైతన్యం చేస్తూ ఈ యాత్రను కొనసాగించడం జరుగుతుంది అని అన్నారు ఈ యాత్రలో మాదిగ మాదిగ ఉపకులాల యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసంగ్రామ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ పిల్లి కండ్ల ఆనంద్, MSP జిల్లా కో కోఆర్డినేటర్ G. రవి, MSP జిల్లా సీనియర్ నాయకులు తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి పెద్దోళ్ళ ఆనంద్ కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మాదిగ, MSP వికారాబాద్ నియోజకవర్గం మహిళా ఇంచార్జి పుష్ప, MSP నాయకులు మల్లేశం, MSP పరిగి నియోజకవర్గం ఇంచార్జి రమేష్, MRPS నాయకులు నర్సిములు, షాద్ నగర్ రమేష్ పూడూర్, MSF జిల్లా ఇంచార్జి మల్లికార్జున్ మాదిగ, MSP పెద్దేముల్ మండల్ ఇంచార్జి B. స్వామిదాస్, బషీరాబాద్ మండల్ ఇంచార్జ్ B. కృష్ణ, తాండూర్ మండల్ ఇంచార్జి P. నర్సిములు, యాలాల మండల్ ఇంచార్జి M. నర్సిములు, MSP తాండూర్ టౌన్ నాయకులు డాక్టర్ శ్రీకాంత్, MRPS యాలాల ఇంచార్జి D. మహేందర్ బషీరాబాద్ మండల్ ఇంచార్జి ప్రకాష్ మాదిగ, తాండూర్ మండల్ ఇంచార్జి L.రమేష్ మాదిగ, MSP నాయకులు ఎల్లేశం, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


