పేదల దేవుడు సీఎం కేసీఆర్

తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల దేవుడు సీఎం కేసీఆర్
– ఐవీఎఫ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడని తాండూరు టీఆర్ఎస్ యువనాయకులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ మూడు రోజుల జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్, తెలంగాణ టూరిజం చైర్మ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు, ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల ఆదేశాల మేరకు మంగళవారం రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి శంకర్ తో కలిసి వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న వారికి దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ రమణబాబు, సిబ్బంది శ్రీధర్, ఐవీఎఫ్ జిల్లా కోశాధికారి ఆగీరు మహేష్, తాండూరు కోశాధికారి సతీష్, సభ్యులు ప్రమోద్, వీరు, సోమ శేఖర్, అనిల్ జగన్ తదితరులు పాల్గొన్నారు.