కాగ్నా బ్రిడ్జి భద్రతకు చర్యలు చేపట్టాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

కాగ్నా బ్రిడ్జి భద్రతకు చర్యలు చేపట్టాలి
– వంతెనపై దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించిన బీఎస్‌ఆర్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాగ్నా బ్రిడ్జి భద్రతకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు.

కాగ్నానది బ్రిడ్జిపై రంధ్రం పడిన విషయం తెలుసుకున్న ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బ్రిడ్జిపై రహదారి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ డీఈఈ, నేషనల్‌ హైవే శాఖ అధికారులు, సిబ్బంది బ్రిడ్జి పరిస్థితిని బీఎస్‌ఆర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన వాహనదారులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు, హెచ్చరిక సూచికలను కూడా బీఎస్‌ఆర్‌ పరిశీలించారు.

రహదారి మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేసి వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు.

ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్‌ ఆపన్నహస్తం..!