ఆద‌ర్శ వివాహాల‌కు ఆర్థిక‌ చేయూత

తాండూరు వికారాబాద్

ఆద‌ర్శ వివాహాల‌కు ఆర్థిక‌ చేయూత
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– రెండు జంటలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఇద్ద‌రు ఇష్ట‌ప‌డి చేసుకున్న ఆద‌ర్శ వివాహాల‌కు తెలంగాణ స‌ర్కారు ఆర్థిక చేయూతనందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణానికి చెందిన కులాంతర వివాహాలు చేసుకున్న రెండు జంటలకు రూ.2.50 లక్షల చొప్పున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. బుధవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లబ్దిదారులకు ఆర్థిక సహాయం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులాంతర వివాహాలకు సర్కారు ఆర్ధిక చేయూతనందిస్తుందని అన్నారు. ఈ సహాయంతో స్వయం ఉపాధిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.