రాఖీ కట్టి.. రక్షణ కోరి..!
– తాండూరు ఉత్సహాంగా రాఖీ సంబరాలు
– నేతలకు, అధికారులకు ఎస్కేటీఎస్ విద్యార్థులు
– తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శ్రీ క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఉత్సహంగా రాఖీ సంబరాలను జరుపుకున్నారు. తాండూరులోని నేతలకు, ప్రభుత్వ శాఖల అధికారులకు విద్యార్థులు రాఖీలు కట్టి రక్షణగా నిలవాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి యేడాది ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
ఇందులో భాగంగా శనివారం తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, డివిజన్ ఎసీఓ వెంకటరమణ, ఆర్టీసీ డీఎం సురేష్ కుమార్, ఎంఈఓ వెంకటయ్య గౌడ్, ఎంపీడీఓ, పోలీస్టేషన్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టారు. అంతకుముందే పాఠశాల డైరెక్టర్లు ద్యావరి విష్ణువర్ధన్రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, ద్యావరి జయవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎన్.రమేష్ కు విద్యార్థులు రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, పలుశాఖల అధికారులు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు తెలిసేవిధంగా పండగలను జరుపుకోవడం సంతోషకరమని విద్యార్థులను అభినందించారు. అంతకుముందే పాఠశాలలో చిన్నారి వి ద్యార్థులు రాఖీ పండగను సోదరభావంతో జరుపుకున్నారు.

పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, డైరెక్టర్లు సర్వోత్తమ్రెడ్డి, ద్యావరి జయవర్దన్ రెడ్డిలు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాల విలువలపై చైతన్య కల్పిస్తున్నామన్నారు. రాఖీ పౌర్ణమి సందేశం ఏమిటంటే మేము మీకు రక్ష – మీరు మాకు రక్ష – మని దేశానికి రక్ష అని వివరించారు.
రక్షా బంధన్ వల్ల అందరి మద్య వాత్సల్య బందాలు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రమేష్, సీనీయర్ ఉపాధ్యాయులు పి. చంద్రశేఖర్రెడ్డి, అనిల్ కుమార్, సునీత, టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

