సర్పాలతో స్టంట్లు..!
– కాటేసిన త్రాచుపాము
– నెట్టింట్లో వీడియో వైరల్
దర్శిని డెస్క్: సర్పాలతో స్టంట్లు చేయాలనుకున్న ఓ యువకుడు వాటి కాటుకు ఆసుపత్రి పాలయ్యాడు. పట్టుకువచ్చిన పాములతో పోజిలిస్తే చిర్రెత్తిన ఓ త్రాచుపాము కాటేసి చుక్కలు చూపించింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కర్నాటకకు చెందిన మాజ్ సయ్యద్ అనే యువకుడు మూడు పాములతో ఓ భయంకరమైన స్టంట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదాని ప్రకారం మూడు త్రాచుపాములను ముందు ఉండి తమాషా చేస్తున్నాడు. ఈ క్రమంలో వాటి తోకలను పట్టుకోని లాగుతూ కదిలిస్తుంటాడు. ఇందుకు అనుగుణంగా అవి కూడ.. దూకుడుగా స్పందిస్తుంటాయి. అందులో ఓ పాము ఒక పాము అతనిపై ఒక్కసారిగా దాడి చేసింది. తన నోటితో ప్యాంట్‌ను గట్టిగా పట్టుకుంటుంది. వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు దాని తోక పట్టుకొని లాగేందుకు ప్రయత్నించినా అది గట్టిగా పట్టుకోనే కనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే ఈ పాము కాటుతో సయ్యద్ ఆసుపత్రి పాలయ్యాడు. పాము కాటుతో సయ్యద్ ఇప్పటివరకు 46 యాంటీ-వెనమ్ ఇంజెక్షన్లను తీసుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. వన్యప్రాణాలతో చెలగాటమాడిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
This is just horrific way of handling cobras…
The snake considers the movements as threats and follow the movement. At times, the response can be fatal pic.twitter.com/U89EkzJrFc— Susanta Nanda (@susantananda3) March 16, 2022

