ట్రైన్‌లో గోవా మద్యం బాటిళ్లు..!
– ఫ్లాట్ ఫారంపై గంజాయి బ్యాగులు
– ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో గుట్టు రట్టు
– రూ. 2లక్షల విలువ సొత్తు స్వాదీనం
– వెల్లడించిన జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైలు మార్గంలో సాగుతున్న మద్యం, గంజాయి రవాణా గుట్టును జిల్లా ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. తాండూరు మీదుగా వెళుతున్న పలు రైళ్లలలో మద్యం బాటిళ్లు, గంజాయి బస్తాలను స్వాదీనం చేసుకున్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో రెండు ఘటనలకు సంబంధించిన వివరాలను జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 31, నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో రైళ్ల మార్గంలో అక్రమ మద్యం, డ్రగ్స్, గంజాయి రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో గోవా నుంచి వస్తున్న వాస్కోడిగామ ఎక్సైప్రెస్ రైళ్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ తనిఖీల్లో నాన్ డ్యూటీ పేయిడ్ ఉన్న 95 గోవా మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా శనివారం తాండూరు పట్టణంలోని రైల్వే స్టేసన్‌లో భువనేశ్వర్ నుంచి ముంబయి వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లో తనిఖీలు చేయడం జరిగిందని, ఈ తనిఖీల్లో ఏమి లభించలేదన్నారు. కాని, 2వ నెంబర్ ప్లాట్ ఫారమ్ పై గుర్తు తెలియని వ్యక్తులు వదిలేని గంజాయి బస్తాలను గుర్తించడం జరిగిందన్నారు. 2కిలోల బ్యాగులతో ఆరు బ్యాగుల్లో మొత్తం 12 కిలోల బస్తాలను గుర్తించి స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ తనిఖీల్లో పట్టుబడిన గోవా మద్యం బాటిళ్ల విలువ రూ. లక్ష, గంజాయి బస్తాల విలువ రూ. 1లక్ష మొత్తం రూ.2లక్షల వస్తువులను స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు ఎవరు పట్టుబడలేదని, ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్, వికారాబాద్ ఎస్ఐ వీరాంజనేయలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

