నేడే జ‌ప్తు వాహ‌నాల వేలం

క్రైం తాండూరు వికారాబాద్

నేడే జ‌ప్తు వాహ‌నాల వేలం
– వికారాబాద్‌లో నిర్వ‌హ‌ణ
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిది: వివిధ కేసుల్లో ప‌ట్టుబ‌డి జ‌ప్తు చేసిన వాహ‌నాల‌కు నేడు వికారాబాద్ జిల్లా పోలీసులు వేలం వేయ‌నున్నారు. భారీ ఎత్తున వాహ‌నాల‌ను వేలం వేస్తున్న‌ట్లు ఆ శాఖ రెండు రోజుల క్రితం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇందులో 273 బైకులు, 40 ఆటోలు, 15 కార్లు(తుక్కు కింద‌), మ‌రో 30 బైకులు, 1 ట్రాక్ట‌ర్(న‌డిపించేది)ను వేస్తున్న‌ట్లు తెలిపారు. వీటిని వివిధ కేసుల్లో జ‌ప్తు చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. నేడు ఉద‌యం 11-30 గంట‌ల‌కు వేలం వేస్తున్న‌ట్లు అధికారులు విడుద‌ల చేసిన‌ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. వికారాబాద్ సూర్య ప్ర‌కాష్ న‌గ‌ర్లోని జిల్లా పోలీస్ శిక్ష‌ణ కేంద్రంలో వాహ‌నాల వేలం ఉంటుంద‌ని తెలిపారు. పూర్తి వివ‌రాల‌కు 9441037994, 9492922964ల‌కు సంప్ర‌దింవ‌చ్చ‌ని సూచించారు. అస‌క్తిగ‌ల వారు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.