డియర్‌ ఓటర్‌..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

డియర్‌ ఓటర్‌..!
– ఈ రూల్స్ మీకు తెలుసా..?
– టెన్షన్‌ లేకుండా ఓటు వేయొచ్చు
దర్శిని డెస్క్ : ఓ మై డీయర్ ఓటర్.. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రెడీ అయ్యారా.. అయితే కొన్ని రూల్స్ తెలుసుకోండి. ఈ రూల్స్ తెలిస్తే టెన్షన్‌ లేకుండా ఓటు వేయవచ్చు. మీదగ్గర ఓటరు గుర్తింపు కార్డు ఉంటే ఓకే.. లేకుంటే.. 13 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్‌ బూత్‌లో చూపించవచ్చు. అందులో ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌, భారతీయ పాస్‌పోర్టు, ఫొటో ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీస్‌ పాస్‌బుక్‌, సర్వీస్‌ ఐడీ కార్డు, NPR స్మార్ట్‌ కార్డు, MNREGA జాబ్‌ కార్డు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, ఫొటో గల పెన్షన్‌ పత్రాలు, కేంద్రం జారీ చేసిన డిసేబిలిటీ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యేల ఐడీ కార్డులలో ఏదో ఒకటి చెల్లుతుంది. ఓటే వేసే ముందు రోజే మీ పేరుని వెబ్‌సైట్లో చెక్‌ చేసుకోండి. మీ ఓటర్‌ కార్డుమీద ఉండే ఎపిక్‌ కోడ్‌ను.. electoralsearch.eci.gov.in వెబ్‌సైట్లో ఎంటర్‌ చేస్తే.. మీ పోలింగ్‌ బూత్‌ వివరాలు తెలుస్తాయి. అక్కడే మీ ఓటరు స్లిప్పు డౌన్‌లోడ్‌ చేసుకోండి.

ఓటు వేసే విధానం ఇలా
ఒక్కసారి పోలింగ్‌ బూత్‌లోకి ఎంటర్‌ అయ్యాక ఏదైనా తెలియకపోతే అక్కడే ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ను అడగాలి. వారి దగ్గరున్న ఓటరు జాబితాలో పేరు, సీరియల్‌ నెంబరుని, మీ దగ్గరున్న ఓటరు స్లిప్పులో నెంబరు, గుర్తింపు కార్డులో పేరుని సరిచూసుకుని ఓటేసేందుకు అక్కడ సిబ్బంది మీకు అవకాశం ఇస్తారు. మరో పోలింగ్‌ అధికారి మీ ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు. మీ వివరాలను ఫామ్‌ 17Aలో నమోదు చేస్తారు. ఆసమయంలో ఓటరు జాబితాలో మీ బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. అనంతరం మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌కు వెళ్లడానికి అనుమతిస్తారు.

ఓటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే EVM మెషీన్‌, దాని పక్కనే VVPAT యంత్రమూ ఉంటుంది. ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క…. వారికి కేటాయించిన గుర్తులు మరో వైపు.. వీటి పక్కన్నే నీలి రంగు బటన్‌ ఉంటాయి. మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న బ్లూ కలర్‌ బటన్‌ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క. బటన్‌ నొక్కిన తరువాత అయిదు సెకన్ల పాటు బీప్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఆ వెంటనే VVPAT మెషీన్‌పై పచ్చటి లైట్‌ వెలిగి.. లోపల స్లిప్‌ కనిపిస్తుంది. మీరు ఎవరికి ఓటేశారో వారిపేరు, సీరియల్‌ నెంబర్‌, పార్టీ గుర్తు దానిపై కనిపిస్తాయి. ఈ కాగితపు స్లిప్‌ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. ఆ తరువాత ఈ స్లిప్‌ బాక్స్‌లోకి పడిపోతుంది.

ఇదికూడా చదవండి…

టెన్షన్‌ తగ్గించే కొత్తమీర టీ..!