జిల్లాలో స‌ద‌రం క్యాంపు షెడ్యూల్ విడుద‌ల‌

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

జిల్లాలో స‌ద‌రం క్యాంపు షెడ్యూల్ విడుద‌ల‌
– 21 నుంచి జూన్ 30 వ‌ర‌కు క్యాంపులు
– జిల్లాలో ఎంత‌మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారంటే..?
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలో నిర్వహించే స‌ద‌రం క్యాంపు షెడ్యూల్‌ను అధికారులు ప్ర‌క‌టించారు. ఈనెల 21 నుంచి జూన్ 30 వ‌ర‌కు జిల్లాలోని వివిధ ఆసుప‌త్రుల‌లో ఏర్పాటు చేసిన క్యాంపు వివ‌రాల‌ను ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఈనెల 21న వికాబాద్‌లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వికారాబాద్, పూడూరు, దోమ‌, కుల్క‌చెర్ల‌, ప‌రిగి, మ‌ర్ప‌ల్లి, మోమొన్ పేట్, న‌వాబ్ పేట్, కోట్‌ప‌ల్లి ప్రాంతాల వారి అంగ‌వైకల్యానికి సంబంధించి సద‌రం క్యాంపును ఏర్పాటు చేశారు. ఈనెల 28న తాండూరులోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కోడంగ‌ల్, బొంరాస్ పేట్, బంట్వారం, దౌల్తాబాద్, తాండూరు, తాండూరు మండ‌లం, ధారూర్, యాలాల‌, బ‌షీరాబాద్‌, పెద్దేముల్ ప్రాంతాల వారికి అంగ‌వైక‌ల్యానికి సంబంధించి స‌ద‌రం క్యాంపు ఏర్పాటు చేశారు. వ‌చ్చే నెల మే 4న వికారాబాద్‌లోని క‌మ్యూనిటి ఆరోగ్య కేంద్రంలో అన్ని మండ‌లాల వారికి కంటి చూపు లోపంకు సంబంధించి సద‌రం క్యాంపు ఏర్పాటు చేశారు. మే 12న తాండూరులోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కోడంగ‌ల్, బొంరాస్ పేట్, బంట్వారం, దౌల్తాబాద్, తాండూరు, తాండూరు మండ‌లం, ధారూర్, యాలాల‌, బ‌షీరాబాద్, పెద్దేముల్ ప్రాంతాల వారికి అంగవైకల్యానికి సంబంధించి స‌ద‌రం క్యాంపు ఏర్పాటు చేశారు. మే 19న వికారాబాద్‌లోని క‌మ్యూనిటి ఆరోగ్య కేంద్రంలో వికారాబాద్, పూడూరు, దోమ‌, కుల్క‌చెర్ల‌, ప‌రిగి, మ‌ర్ప‌ల్లి, మోమిన్ పేట్, న‌వాబ్ పేట్, కోట్ ప‌ల్లి ప్రాంతాల వారికి అంగవైక‌ల్యానికి సంబంధించి స‌ద‌రం క్యాంపు ఏర్పాటు చేశారు. మే 26న తాండూరులోని జిల్లా ఆసుప‌త్రిలో అన్ని మండ‌లాల వారికి మాన‌సికం, బుద్దిమాంద్యం విక‌లాంగుల‌కు స‌ద‌రం క్యాంపు ఏర్పాటు చేశారు. జూన్ 8వ తేదిన వికారాబాద్‌లోని క‌మ్యూనిటి ఆరోగ్య కేంద్రంంలో జిల్లాలోని అన్ని మండ‌లాల వారికి కంటిచూపు లోపంకు సంబంధించి స‌ద‌రం క్యాంపు ఏర్పాటు చేశారు. జూన్ 16న తాండూరులోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కోడంగ‌ల్, బొంరాస్ పేట్, బంట్వారం, దౌల్తాబాద్, తాండూరు, తాండూరు మండ‌లం, ధారూర్, యాలాల‌, బ‌షీరాబాద్, పెద్దేముల్ మండ‌లాల వారికి అంగ‌వైక‌ల్యంకు సంబంధించి స‌ద‌రం క్యాంపు ఏర్పాటు చేశారు. జూన్ 23న వికారాబాద్‌లోని కమ్యూనిటి ఆరోగ్య కేంద్రంలో వికారాబాద్, పూడూరు, దోమ‌, కుల్క‌చెర్ల‌, ప‌రిగి, మ‌ర్ప‌ల్లి, మోమిన్ పేట్, న‌వాబ్ పేట్, కోట్ ప‌ల్లి, వికారాబాద్ మండ‌లాల వారికి అంగ‌వైకల్యానికి సంబంధించి స‌ద‌రం క్యాంపు ఏర్పాటు చేశారు. జూన్ 30న తాండూరులోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అన్ని మండ‌లాల వారికి వినికిడి లోపం ఉన్న విక‌లాంగుల‌కు స‌ద‌రం క్యాంపు ఏర్పాటుచేశారు. మొత్తం ప‌ది క్యాంపుల ద్వారా 500 మంది విక‌లాంగుల‌కు స‌ద‌రం ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని అధికారులు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ క్యాంపుల‌ను వికలాంగులు, త‌ల్లిదండ్రులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.