జిల్లా ఆసుప‌త్రిలో నేత్ర వైద్య సేవ‌లు

ఆరోగ్యం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

జిల్లా ఆసుప‌త్రిలో నేత్ర వైద్య సేవ‌లు
– నాలుగేళ్ల త‌రువాత అందుబాటులోకి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో నేత్ర వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. సోమ‌వారం ఉద‌యం నుంచి ఆసుప‌త్రిలో సంబంధిత వైద్యురాలితో సేవ‌ల‌ను ప్రారంభించారు. దాదాపు నాలుగేళ్ల త‌రువాత నేత్ర వైద్య సేవ‌ల‌ను ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డా.మ‌ల్లికార్జున స్వామి తెలిపారు. కంటి స‌మ‌స్య‌లు, దృష్టిలోపం వంటి తదిత‌ర స‌మ‌స్య‌లు ఉన్న ప్ర‌జ‌లు ఈ వైద్య సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఇన్నాళ్లు జిల్లా ఆసుప‌త్రిలో నేత్ర వైద్య సేవ‌లు అందుబాటులో లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డారు. ప్రైవేటు ఆసుప‌త్రుల చుట్టు, హైద‌రాబాద్‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఉండేది. తాజాగా జిల్లా ఆసుప‌త్రిలో నేత్ర వైద్య సేవ‌లు అందుబాటులోకి రావ‌డంపై ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.