రామందిరానికి విరాళాల వెల్లువ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రామందిరానికి విరాళాల వెల్లువ..!
– ఒకే రోజు 10 మంది దాతల ఆర్థిక సాయం
– ఆలయ కమిటి సభ్యులకు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని శ్రీరామ మందిరానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

దేవాలయ పునర్ నిర్మాణం కోసం ఆలయ కమిటీ సభ్యులు దాతల నుంచి ఆర్థిక సాయం సేకరిస్తున్నారు. పట్టణంలోని దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా గురువారం దేవాలయ పునర్ నిర్మాణం కోసం పది మంది దాతలు విరాళాలు అందించారు.

పట్టణానికి చెందిన కల్వ రాజలింగం రూ. 51 వేలు, కోట్ పల్లి రాజు రూ. 51 వేలు, గడ్డలి రవి రూ.25వేలు, మనుగంటి బ్రహ్మం రూ. 21 వేలు, మధుసూదన్ రూ. 11 వేలు, కల్వ సురేష్ రూ. 5వేల 111, సోదరి రవి చారి రూ. 5వేలు, మల్లేశం రూ. 5వేల 100, ఆర్మీ కృష్ణ రూ. 5వేలు, బలరాం రూ. 5వేల 100ల చొప్పున విరాళాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఎవరైనా దాతలు, భక్తులు దేవాలయ పునర్ నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

భయపడకుండా పాలించండి..!