హాల్ టిక్కెట్‌లో త‌ప్పుగా ప‌రీక్షా కేంద్రం పేరు

కెరీర్ తాండూరు వికారాబాద్

హాల్ టిక్కెట్‌లో త‌ప్పుగా ప‌రీక్షా కేంద్రం పేరు
– టీఎంఆర్జేసీగా బ‌దులుగా టీఎస్ఆర్జేసీగా ముద్ర‌ణ‌
– విద్యార్థులు గ‌మ‌నించాల‌ని ప్రిన్సిప‌ల్ సూచ‌న‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఇంట‌ర్ హాల్ టిక్కెట్‌లో తాండూరు ప్రాంతంలోని ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రానికి సంబంధించి పేరు త‌ప్పుగా ముద్రించ‌బ‌డింది. దీంతో విద్యార్థులు ఆయోమ‌యానికి గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో క‌ళాశాల ప్రిన్సిప‌ల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం నుంచి ప్రారంభ‌య్యే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను దృష్టిలో ఉంచుకుని హైద‌రాబాద్ రోడ్డు మార్గం రాజీవ్ గృహ క‌ల్ప కాల‌నీ స‌మీపంలో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియ‌ల్ బాలిక‌ల‌ జూనియ‌ర్ కాలేజీ(టీఎంఆర్జేసీ) జీ-1ను మొద‌టి సారిగా ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రం(సెంట‌ర్ కోడ్ – 57038)గా ఏర్పాటు చేశారు. విద్యార్థుల‌కు మంజూరు చేసిన హ‌ల్ టిక్కెట్‌లో సెంట‌ర్ పేరును త‌ప్పుగా ముద్రించారు. టీఎంఆర్జేసీకి బ‌దులుగా టీఎస్ఆర్జేసీగా త‌ప్పుగా వ‌చ్చింద‌ని టీఎంఆర్జేసీ ప్రిన్సిప‌ల్ సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళ‌న చెంద‌కుండా టీఎంఆర్జేసీ కేంద్రానికి వ‌చ్చి ప‌రీక్ష రాయొచ్చ‌ని సూచించారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని ప్రిన్సిప‌ల్ మెహ‌బూబ్ ఫాతిమా సూచించారు.