పేదలను ఆదుకునేది కాంగ్రెస్ పార్టే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పేదలను ఆదుకునేది కాంగ్రెస్ పార్టే..!
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
– మాజీ ఎమ్మెల్యే నారాయణ రావుతో కలిసి ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎప్పటికి పేదలను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీనే అని ఆ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార నేపథ్యంలో భాగంగా మంగళవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం విస్తృతంగా జరిగింది.. ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణ రావుతో కలిసి ప్రచారం చేశారు. మండలంలోని కాశింపూర్, కుప్పన్ కోట్ తాండా, తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల నిరుపేదలను ఆదుకుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్లు అందించిందని గుర్తుచేశారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందన్నారు. గృహలక్ష్మి, భరోసా, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు చేయూత వంటి పథకాలను అమలు చేసి తీరుతుందన్నారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యకరమంలో మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహరాజ్, నాయకులు వెంకటేష్ మహరాజ్, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ శాంతి బాయి, రాము నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..