సాయిపూర్‌లో పైలెట్ పండ‌గ‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సాయిపూర్‌లో పైలెట్ పండ‌గ‌..!
– చిన్నారుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసిన ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
– ఘ‌నంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జ‌న్మ‌దినోత్స‌వం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణం సాయిపూర్‌లోని 9వ వార్డులో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని వార్డులో బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హించారు. మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు ఆధ్వ‌ర్యంలో జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు చిన్నారులు, వార్డులోని మ‌హిళ‌ల‌తో క‌లిసి కేక్‌ను క‌ట్ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్షలు చెబుతూ పంచిపెట్టుకున్నారు.
దీంతో ఆ ప్రాంగ‌ణ‌మంతా పండ‌గ వాతావ‌ర‌ణం నెలకొంది. అనంత‌రం దీపా న‌ర్సింలు మాట్లాడుతూ తాండూరు నియోజ‌క‌వ‌ర్గం, మున్సిప‌ల్ అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు. అదేవిధంగా ప‌ట్ట‌ణంలోని విలియం మూన్ స్కూల్‌లో పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్యే జ‌న్మ‌దిన వేడుక‌ల‌లో ప్ర‌జ‌లంద‌రు పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో వార్డు ప్ర‌జ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.