సత్యమూర్తి సస్పెన్స్‌కు తెర..!

క్రైం తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

సత్యమూర్తి సస్పెన్స్‌కు తెర..!
– వారణాణిలో పిల్లలతో క్షేమం
– రెండు రోజులు గాలించి గుర్తించిన పోలీసులు
– ప్రకటించిన జిల్లా ఎస్పీ, తాండూరు డీఎస్పీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : భార్య అదృశ్యం కేసును చేధించాలని 48 గంటల గడువు ఇచ్చి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయి సత్యమూర్తి విధించిన సస్పెన్స్‌కు తెరపడింది. గత మూడు నెలల క్రితం తన భార్య అన్నపూర్ణ(36) అదృశ్యమైతే పోలీసులు కేసును చేధించడం లేదని మనస్థాపం చెందిన సత్యమూర్తి ఆవేధనతో అతని పిల్లలతో కలిసి సెల్పీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసులకు 48 గంటల గడువు ఇచ్చి కేసును పరిష్కరించక పోతే ఆత్మహత్య చేసుకుంటామని, మృతదేహాల లోకేషన్ షేర్ చేస్తామని చెప్పడంతో ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రంలో సంచలనమైంది.
ఈ కేసులో రంగంలోకి దిగిన పోలీసులు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, తాండూరు డిఎస్పీ జి.శేఖర్ గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సెల్పీ వీడియో అనంతరం సత్యమూర్తి ఎక్కడికి వెళ్లారనే కోణంగా విచారణ ప్రారంభించారు. పరిగి మీదుగా శంషాబాద్ నుంచి ముంబయ్ అక్కడి నుంచి వారణాసి, కాశీ వెళ్లినట్లు గుర్తించారు. రెండు రోజుల పాటు శ్రమించి ఎట్టకేటలకు వారణాసిలోని ఓ లాడ్జిలో సత్యమూర్తి, అతని కూతుళ్లు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. విషయాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, తాండూరు డీఎస్పీ కోటిరెడ్డికి వివరించడంతో సోమవారం వారు సత్యమూర్తి అజ్ఞాతం సస్పెన్స్‌కు తెరదించారు. వారణాసి నుంచి వారిని క్షేమంగా తీసుకరావడం జరుగుతుందని మీడియాకు ప్రకటించారు. 48 గంటలు ఎంతో ఉత్కంఠతకు గురిచేసిన ఈ సంఘటనలో సత్యమూర్తి, పిల్లలు క్షేమ సమాచారం తెలుసుకుని పోలీసు అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇంట్లో ఫోన్లు, పెన్ డ్రైవ్లో స్వాధీనం
మరోవైపు 48 గంటల ముందు సెల్పీ వీడియోలో సత్యమూర్తి వెల్లడించిన వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారణాసిలో సత్యమూర్తి క్షేమంగా ఉన్నారని సమాచారం తెలిసిన వెంటనే పట్టణ ఎస్ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ పట్టణంలోని సత్యమూర్తి నివాసానికి చేరుకున్నారు.

సత్యమూర్తి సోదరుల సమక్షంలో నివాసాన్ని తెరిచారు. ” ఎల్పీ వీడియోలో వెల్లడించిన విధంగా దాదాపు 5 సెల్ఫోన్లు, 10 పెన్ డ్రైవ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు సత్యమూర్తి రాసిన లేఖలను కూడ స్వాదీనం చేసుకున్నారు.

https://www.youtube.com/watch?v=HAkkj3xW1Oc