ఇదేం పెద్ద‌రికం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇదేం పెద్ద‌రికం..!
– పిలిచి అవ‌మానిస్తారా..
– ప‌ట్ట‌ణ ఎస్సీసెల్ అధ్య‌క్షుడి ఆవేధ‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద హోదాలో ఉన్న సొంత పార్టీ నేత‌నే పిలిచి అవ‌మానించార‌ని టీఆర్ఎస్ తాండూరు ప‌ట్ట‌ణ ఎస్సీ సెల్ అధ్య‌క్షులు అవేధ‌న వ్య‌క్తం చేశారు. ఈ సంఘ‌ట‌న తాండూరులో వివాదాస్పందంగా మారింది. శ‌నివారం టీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజ‌క‌వ‌ర్గ అధికార ప్ర‌తినిధి త‌న‌ నివాసంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి త‌న‌ను కూడ ఆహ్వానించార‌ని టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ ఎస్సీ సెల్ అధ్య‌క్షులు నీర‌టీ హ‌న్మంతు తెలిపారు. సమావేశంలో మాట్లాడే ముందు మూడే కుర్చీలు వేశార‌ని, అధికార ప్ర‌తినిధి ఓ కుర్చిలో కూర్చోగా ఇంకో కుర్చిలో మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ కూర్చున్నార‌ని.. మ‌రో కుర్చి ఖాళీగానే ఉంద‌ని చెప్పుకొచ్చారు. అయితే అధికార ప్ర‌తినిధి త‌ర్వాతి స‌మావేశంలో కూర్చోవాల‌ని సూచించి.. త‌న‌ను బ‌య‌ట వేయిట్ చేయ‌మ‌ని చెప్పిన‌ట్లు వివ‌రించారు. అ త‌రువాత మున్సిప‌ల్ కోఆప్ష‌న్ స‌భ్యురాలి భ‌ర్త వ‌చ్చినా కూడ ఆ కుర్చిలో కూర్చోనివ్వ‌లేద‌ని తెలిపారు. ఆ వెంట‌నే అధికార ప్ర‌తినిధి వారి సామాజిక వ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి కుర్చిలో కూర్చునేందుకు అవ‌కాశం ఇచ్చార‌ని తెలిపారు. అధికార ప్ర‌తినిధి హోదాలో ఉన్న నాయ‌కులు త‌మ‌ను త‌క్కువ‌గా భావించ‌డం ప‌ద్ద‌తి కాద‌ని ఆయ‌న ముందే వాపోయారు. పిలిచి అవ‌మానించే విధంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ‌తామ‌ని మీడియాతో పేర్కొన్నారు.