ఆపదకుముందే అప్రమత్తం..!
– పోలీసు, ప్రజా ప్రతినిధులతో జాగ్రత్త చర్యలు
– ప్రజలు అధికారుల సూచనలు పాటించాలి
– తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాలతో ఎలాంటి ఆపదలు సంభవించకుండా అప్రమత్త చర్యలు తీసుకుంటున్నామని తాండూరు డీఎస్పీ జి.శేఖర్ గౌడ్ పేరొ న్నారు. సోమవారం తాండూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రానున్న రెండు రోజులు జోరు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సూచనల వె రకు పోలీసు శాఖను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. తాండూరు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజలు పాడుబడిన, శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లలో ఉండకుండా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లతో ప్రజలకు సందేశాలను పంపిస్తున్నామన్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు ఇనుప వస్తువులు, విద్యుత్ పరికరాలు, స్థంబాలు ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, యువకులు చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రజలకు సూచించడం జరుగుతుందన్నారు. తాండూరు పరిసర ప్రాంతాలలో బ్రిడ్జీలు, వాగులు దాటే క్రమంలో ఎమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నామన్నారు. ప్రజలకు వర్షాల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలిగినా అధికారులను సంప్రదించాలని, నియంత్రణకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితులో గ్రామాలకు వెళ్లే వా వానదారులు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే ప్రయాణాలను విరమించుకోవాలని సూచించారు. గ్రామాల్లో, ప్రజలు చేపలు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇందుకు ప్రజలందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



