రెండో రోజు ఉత్సహాంగా..
– గల్లి గల్లికి ఎమ్మెల్యే
– సమస్యలు తెలుసుకుంటున్న రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేపట్టిన గల్లి గల్లికి ఎమ్మెల్యే కార్యక్రమంలో రెండో రోజు మంగళవారం ఉత్సహాంగా ప్రారంభమయ్యింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 20 వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు,
ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్, కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వార్డు పర్యటనను కొనసాగిస్తున్నారు. వార్డుల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడే ఉన్న మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ నీరజా బాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, కౌన్సిలర్ సంగీత ఠాకూర్, ముక్తార్, టీఆర్ఎస్ యువనాయకులు సంతోష్‌గౌడ్, ఉర్దూ ఘర్ చైర్మన్ రజాక్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
