జవాన్‌లే నిజనమైన దేశభక్తులు
– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ
– తాండూరులో కార్గిల్ విజయదివస్ వేడుకలు
తాండూరు,దర్శిని ప్రతినిధి : దేశం కోసం ప్రాణాలర్పించిన కార్గిల్ జవాన్‌లు నిజమైన దేశభక్తులని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణం సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో కార్గిల్ దివాస్‌ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీతోపాటు సోషల్ వర్కర్ వెంకట్, ప్రిన్సిపల్ శ్రీదేవి, ఎస్ఎంసీ చైర్మన్ ప్రభులు కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు నివాళులు అర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన కార్గిల్ జవాన్లను ఎన్నటికీ మరువరాదన్నారు. కార్గిల్ పోరులో ప్రాణాలొదిలిన జవాన్లే నిజ మైన దేశభక్తులని అన్నారు. కార్గిల్ దివాస్ సందర్భంగా వారికి నివాళులు అర్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రవీణ, రజిత, శ్రీధర్, బాలకృష్ణ, రఘు, విజయలక్ష్మీ, సాయి, లక్ష్మీ, ఇందిరమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



