చిన్నారులకు ఆనందం పంచిన కౌన్సిలర్
– ఆట వస్తువులను అందజేసిన సంగీత ఠాకూర్
– కృతజ్ఞతలు తెలిపిన టీచర్, తల్లిదండ్రులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: అంగన్ వాడి కేంద్రంలో ఉన్న చిన్నారులకు తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఆనందం పంచారు. వార్డులోని గాంధీనగర్‌లోని అంగన్ వాడి కేంద్రం చిన్నారులకు ఆమె ఆట వస్తువులను అందజేశారు. గురువారం ఆమె తన జన్మదిన వేడుకలను అంగన్ వాడి కేంద్రంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ తన భర్త అజయ్ సింగ్ ఠాకూర్‌తో కలిసి చిన్నారులకు ఆట వస్తువులు, చాట్స్ అందజేసి చాక్లెట్స్ పంచారు. అనంతరం సంగీత ఠాకూర్ మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన పోషిహాకారం అందించడంతో పాటు చదువుపై దృష్టిసారించేలా అంగన్ వాడీ కేంద్రాలను కొనసాగించడం జరుగుతుందన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు రెండున్నరేళ్ల పిల్లలను అంగన్ వాడి కేంద్రాలను చేర్చించి అలవాటు చేయించాలన్నారు. చిన్నారులకు ఆట వస్తువులు అందించడం పట్ల టీచర్, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ రాధా, ఆయమ్మ అనిత, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

