తెగిన కాగ్నా బ్రిడ్జి..!

తాండూరు

తెగిన కాగ్నా బ్రిడ్జి..!
– కొట్టుకుపోయిన పాత మ‌ర‌మ్మ‌త్తులు
– కొత్త బ్రిడ్జి గ‌ట్టుకు బీట‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులోని కాగ్నాపురాత‌న బ్రిడ్జి మ‌ళ్లీ కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం కాగ్నా బ్రిడ్జికి వ‌ర‌ధ పోటెత్తిన విష‌యం తెలిసిందే. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు కాగ్నాన‌దిలో వ‌రద నీరు ఉధృతంగా ప్ర‌వ‌హించింది. గ‌తంలో కాగ్నాన‌ది పాత బ్రిడ్జికి కోడంగ‌ల్ రోడ్డు మార్గం వైపు మ‌ర‌మ్మ‌త్తులు జ‌రిగాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా బ్రిడ్జి కెనాల్ లు కూలిపోయాయి. ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మంత్రిగా ఉన్న‌స‌మ‌యంలో, ప్ర‌స్తుతం ఎమ్మెల్యే హాయాంలో రెండు సార్లు బ్రిడ్జి కూలిపోయింది. అప్ప‌ట్లో కొత్త బ్రిడ్జి అందుబాటులోకి లేక‌పోవ‌డంతో రాక‌పోక‌ల‌కు ఇబ్బందుల‌కు గురికాకుండా తాత్కాళిక మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టారు. ఈ లోగా కొత్త బ్రిడ్జి అందుబాటులోకి వ‌చ్చింది. ఈ వ‌ర్షాకాలంలో మంగ‌ళ‌వారం భారీ వ‌ర‌ధ ప్ర‌వాహానికి ఇదివ‌ర‌కే మ‌ర‌మ్మ‌త్తులు చేసిన ప్రాంతంలోనే మ‌ళ్లీ కూలీపోయింది. అదేవిధంగా అందుబాటులోకి వ‌చ్చిన కొత్త బ్రిడ్జికి కోడంగ‌ల్ వైపు వేసిన గ‌ట్టుకు కూడ వ‌ర్ష‌పు నీటి ప్ర‌వాహానికి బీట‌లు వారాయి. ఈ ప‌రిణామాల‌పై ప‌లువురు ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. చారిత్రాత్మ‌క‌మైన పాత బ్రిడ్జికి మ‌ళ్లీ మ‌ర‌మ్మ‌త్తులు చేయించాల‌ని, కొత్త బ్రిడ్జి గ‌ట్ల‌కు భ‌ద్ర‌త చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు. వీడియో ఉంది కింద చూడండి…