నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చొప్ప‌బోతున్న స‌ర్కారు

తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చొప్ప‌బోతున్న స‌ర్కారు
– 49 వేల ఆర్థిక శాఖ పోస్టుల భ‌ర్తికి గ్రీన్ సిగ్నల్
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల‌కు త్వ‌ర‌లో మంచి శుభ‌వార్త చెప్ప‌బోతున్న‌ది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం రంగం సిద్ధం చేసినట్లు స‌మాచారం. రాష్ట్రంలో పర్మినెంట్‌, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలే కాకుండా ప్రత్యక్ష నియామకాల భర్తీకి మొత్తం 49 వేల పోస్ట్‌లు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ అంచనా వేసిందని శాఖ వ‌ర్గాల స‌మాచారం. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జోన్ల వారీగా ఆర్థిక శాఖ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇటీవల శాసనసభలో వెల్లడించింది. అయితే ఈ ఉద్యోగాలు తెలంగాణ సర్వీస్‌ పబ్లిక్‌ కమిషన్‌, పోలీసు నియామక, వైద్య, పంచాయతీ నియామక బోర్డుల పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ పలు సమావేశాలు నిర్వహించి.. ఖాళీల గురించి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వివరాలపై కూడా ఆర్థిక శాఖ సమాచారం సేకరించినట్లు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఆర్థిక శాఖకు పలు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉద్యోగ నియామకాల ఫైలును సిద్ధం చేసి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. ఈ విష‌యంపై ప్రభుత్వం ద్వారా స్పష్టమైన ప్రకటన వెలువ‌డ‌డ‌మే త‌రువాయి అన్న‌ట్లుగా ఉంది.