భ‌క్తుల‌కు అన్న‌దానం చేసిన వ‌రాల శ్రీ‌నివాస్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

భ‌క్తుల‌కు అన్న‌దానం చేసిన వ‌రాల శ్రీ‌నివాస్ రెడ్డి
– బావ‌మ‌రిది జ్ఞాప‌కార్థం కార్య‌క్ర‌మం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నాగుల పంచమి సంద‌ర్భంగా తాండూరు మున్సిప‌ల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడ‌ర్ వ‌రాల శ్రీ‌నివాస్ రెడ్డి భ‌క్తుల‌కు అన్న‌దానం చేశారు. మంగ‌ళ‌వారం తాండూరు త‌హ‌సీల్దార్ కార్యాయ‌లంలోని నాగుల క‌ట్ట వ‌ద్ద అన్నదాన కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. పండ‌గ‌తో పాటు బావ‌మ‌రది స్వ‌ర్గీయ రాఘ‌వేంద‌ర్ రెడ్డి జ్ఞాప‌కార్థం అన్న‌దానంతో సేవ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బంటు వేణుగోపాల్, నాయ‌కులు సంపల్లి శ్రీనివాస్, రవి, ప్రశాంత్ కుమార్, రాము, నారాయణ రాథోడ్, హనుమంతు, కృష్ణ, నరసింహ, నరేష్ పాల్గొన్నారు.