భద్రాద్రి సీతారాముల సేవలో తాండూరు నేతలు

తాండూరు వికారాబాద్

భద్రాద్రి సీతారాముల సేవలో తాండూరు నేతలు
– వైకుంఠ ఏకాదశి దర్శనం, పూజలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : భద్రాద్రిలో వెలసిన శ్రీ సీతారాముల సేవలో తాండూరు నేతలు తరించారు. శుక్ర‌వారం తాండూరుకు చెందిన మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్తో పాటు పలువురు నాయకులు భద్రాచలంలోని శ్రీ సీతారాములను దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో వెలసిన స్వామి వార్లకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశితో పాటు తాండూరు ప్రజలు క్షేమంగా ఉండాలని ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు కరోనా, ఓమిక్రాన్ వ్యాప్తికి గురికాకుండా అప్రమత్తంగా ఉండేలా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు. భద్రాచలం సీతారాములను దర్శించుకున్న వారిలో తాండూరుకు చెందిన బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, సర్దార్ పటేల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కెఎన్ రాజు, మోహన్, జోసెఫ్ తదితరులు ఉన్నారు.