ఆనందాల ఆబాల గోపాలం..!
– ఇంటింటా కృష్ణాష్టమి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటింటా కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ఇండ్లు చిన్ని కృష్ణయ్య, గోపికలతో ఆబాల గోపాలన్ని తలపించాయి. ప్రతి ఇళ్లు కృష్ణుని పాద ముద్రలలు, రంగవళ్లులతో ఆరాధ్య దైవాలయ్యాయి. చిన్ని.. కృష్ణుడు.. చిలిపి చేష్టలతో.. బోసి నవ్వులు విరబూసాయి. అదేవిధంగా ప్రజలు శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణుని విగ్రహాలకు, ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ యేడాది కూడ కరోనాను దృష్టిలో ఉంచుకుని ఇండ్లలోనే శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మరోవైపు తాండూరు పట్టణంలోని గీతా మందిరంలో శ్రీకృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వెలసిన శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు.


