దీపా నర్సింలుకు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ అధికారులు
తాండూరు దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం దీపా నర్సింలు జన్మదినాన్ని పురస్కరించుకుని
మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, ఎఈ ఖాజా పాష, శానిటరి ఇనుస్పెక్టర్ శ్యాంసుందర్, ఉద్యోగులు కృష్ణ తదితరులు ఆమె నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా దీపా నర్సింలు చేత కేక్‌ను కట్ చేయించారు. అనంతకం కేక్ తినిపించి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటయ్య, జయప్రకాష్, జవాన్ సిహెచ్ అశోక్, నాగు తదితరులు ఉన్నారు.
