ఘనంగా కాసాని జ్ఞానేశ్వర్ రావు జన్మదిన వేడుకలు
– సంబరంగా జరుపుకున్న ముదిరాజ్ సోదరులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ముదిరాజ్‌ల ముద్దుబిడ్డ, ముదిరాజ్ సంఘం జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ రావు జన్మదిన వేడుకలు తాండూరులో ఘనంగా జరిగాయి. శుక్రవారం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు లొంక నర్సింలు, తాండూరు నియోజకవర్గ వర్గ అధ్యక్షులు ఎస్పీ రవికాంత్‌ల ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. కాసాని జ్ఞానేశ్వార్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని సంఘం సోదరులు కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం జ్ఞానేశ్వర్ రావు నాయకత్వంలో పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు జగదీష్, అశోక్, రాజు, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



