న‌మో..రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లీ..!

తాండూరు వికారాబాద్

న‌మో..రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లీ..!
– వాల్మీకీన‌గ‌ర్‌లో బోనాల జాతర
– దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : న‌మోః రేణుకా ఎల్ల‌మ్మ త‌ల్లీ అంటూ భ‌క్తులు తాండూరు పట్టణం వాల్మీకీనగర్లో వెలసిన అమ్మ‌వారిని ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శుక్ర‌వారం శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు పల్లకి సేవ, బోనాల ఊరేగింపు కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. పురవీధుల్లో ఎడ్లబండి ముందు శోభాయామానంగా కొనసాగాయి. ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు, డోలు, డ‌ప్పు వాయిద్యాలు ఆక‌ట్టుకున్నాయి. ఈ జాతర ఉత్సవాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న సరిమల్లోతో పాటు వార్డు కౌన్సిలర్ అంతారం లలిత, టీఆర్ఎస్ మహిళ నాయకురాలు మాధవి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
తాండూరు ప్ర‌జ‌ల‌ను స‌ల్లంగా చూడాల‌ని అమ్మ‌వారిని వేడుకున్నారు. ఊరేగింపు త‌రువాత బోనాల‌తో వ‌చ్చిన‌ మహిళలు ఆలయం చుట్టు ప్రదక్షణలు చేస్తూ నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కవి ంటి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్మిది రవిశంకర్, పూజారి పాండు, సంగ్రామ్ పటేల్, కాలనీ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.