ఉద్యోగం ప‌ర్మినెంట్ చేస్తామ‌ని పాడుప‌ని

క్రైం వికారాబాద్

ఉద్యోగం ప‌ర్మినెంట్ చేస్తామ‌ని పాడుప‌ని
– లంచం తీసుకుంటూ ఏసీబీ దొర‌కిన ఏఆర్ ఎస్ఐ
– డిమాండ్‌లో డీఎస్పీ ప్ర‌మేయంపై అనుమానాలు
– వికారాబాద్ జిల్లా ఎస్సీ కార్యాలయంలో క‌ల‌క‌లం
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: బాధ్య‌తాయుత‌మైన ర‌క్ష‌ణ‌లో ప‌నిచేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ప‌ర్మ‌నెంట్ చేసేందుకు పాడుప‌నికి పాల్ప‌డ్డారు. డిమాండ్ చేసిన డ‌బ్బుల్లో మిగ‌తా డ‌బ్బులు తీసుకుంటూ అవినీతి శాఖ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఏసీబీ దాడులు చేప‌ట్టిన సంఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. కార్యాల‌యంలో ఫ్లబంర్ గా నియమించడం కోసం శ్రీకాంత్ రెడ్డి దగ్గర ఏఆర్ పోలీసులు రూ. 50వేల‌కు బేరం చేసుకున్నారు. ఇందులో ఏఆర్ డీఎస్పీ స‌త్య‌నారాయ‌ణ‌, ఎస్ఐ ప్రేమ్ సింగ్‌ల పేర్లు బ‌లంగా వినిపించాయి. అయితే ఉద్యోగంలో చేరే సమయంలో శ్రీ‌కాంత్ రెడ్డి నుంచి డీఎస్పీ స‌త్యానారాయ‌ణ రూ. 30వేలు తీసుకున్న‌ట్లు పుకార్లు వ‌చ్చాయి. మిగతా 20వేల కోసం గత కొంత కాలంగా శ్రీకాంత్ రెడ్డి ని ఇబ్బందులకు గురిచేయ‌డంతో త‌న‌ దగ్గర అంతలేవని….15వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇబ్బందులను తట్టుకొలేని శ్రీకాంత్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్క సమాచారంతో మంగ‌ళ‌వారం ఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాంత్ రెడ్డి ద్వారా డబ్బులు తీసుకుంటున్న ఎఆర్ పనిచేస్తున్న ఎస్ఐ ప్రేమ్ సింగ్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప‌ట్టుబ‌డిన ఎస్ఐ ప్రేమ్ సింగ్ డబ్బులు తాను డిమాండ్ చేయలేదని…తమ డీఎస్పీ సత్యనారాయణ తీసుకోమంటేనే తీసుకున్నానని వెల్ల‌డించారు. దీంతో ఎసీబీ అధికార‌లు డీఎస్పీ ప్ర‌మేయంపై విచారణ జ‌రిపారు. ప్రమేయం ఉందని తేలడంతో డబ్బులు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాని ఏసీబీ అధికారులు తమ ఉన్న‌తాధికారుల ఆదేశాల మేరకు నిందితులను మిడియా ముందు చూపడం లేదని, కేసుకు సంబంధించిన వివరాలను సైతం చెప్పవద్దనే నిబంధనలు ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు.